¡Sorpréndeme!

MS Dhoni May Lead CSK vs DC IPL 2025 | కెప్టెన్ రుతురాజ్ కు గాయం..ఢిల్లీతో మ్యాచ్ కు దూరం..?

2025-04-05 0 Dailymotion

 మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులకు ఈరోజు పండుగే. దీనికి రీజన్ దాదాపు రెండేళ్ల తర్వాత ధోని కెప్టెన్సీ చేయనున్నాడు. అదేంటీ ధోని అన్ని రుతురాజ్ కు వదిలేశాడు కదా మళ్లీ ఏంటీ అంటే రుతురాజ్ కు నెట్ ప్రాక్టీస్ లో గాయమైంది. సో మధ్యాహ్నమే మ్యాచ్ కాబట్టి అప్పటి లోపు కోలుకోవటం కష్టమైతే రుతురాజ్ ఓ మ్యాచ్ విశ్రాంతి తీసుకుంటాడు. ఒకవేళ అదే జరిగితే ధోని కెప్టెన్ గా సీఎస్కే ను లీడ్ చేస్తాడు. 29 మే 2023 ధోని కెప్టెన్ గా ఆఖరి మ్యాచ్ చేశాడు. ఆరోజు జరిగిన ఫైనల్లో ఆఖరి ఓవర్లో జడేజా మ్యాజిక్ చేసి చెన్నై సూపర్ కింగ్స్ సంపాదించేలా చేశాడు. ఆరోజు ధోని జడేజా ను అమాంతం గాల్లోకి ఎత్తుకున్న సందర్భాన్ని ఎవ్వరూ మర్చిపోలేదు. మళ్లీ ఆ తర్వాత ధోనీ కెప్టెన్ గా చేయలేదు. 2024 సీజన్ కి రుతును కెప్టెన్ గా అనౌన్స్ చేయటం ధోని సాధారణ ఆటగాడిలా రుతుకు సలహాలు ఇస్తూ కీపింగ్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు రుతురాజ్ లేడు కాబట్టి ధోని కెప్టెన్సీ చేయాలనుకుంటే నాయకుడిగా 227వ ఐపీఎల్ మ్యాచ్ ను నడిపించనున్నాడు ధోని. మొదటి మ్యాచ్ ముంబైపై గెలవటం తప్ప వరుసగా ఆర్సీబీ, రాజస్థాన్ లపై ఓడిపోయింది చెన్నై. మరి ధోని పరాజయాల బాట లో ఉన్ టీమ్ ను కెప్టెన్ గా గెలుపు బాట పట్టిస్తాడా తలా ఫర్ ఏ రీజన్ మార్క్ చూపిస్తాడా చూడాలి. రేపు ధోని కెప్టెన్సీ చేసే అవకాశం ఉందన్న వార్త బయటకు రావటంతో చెపాక్ లో జరిగే ఈ మ్యాచ్ ను కమ్మేయాలని మొత్తం పసుపు సముద్రం కనపడాలని చెన్నై అభిమానులు ప్లాన్ చేస్తున్నారు.